Breaking News

డిజిటల్ అరెస్ట్ పేరుతో 58 కోట్ల చోరీ

డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ముంబైలోని ఓ 72 ఏళ్ల వ్యాపారి నుంచి రూ. 58 కోట్ల భారీ మొత్తాన్ని దోచుకున్నారు.


Published on: 16 Oct 2025 18:45  IST

డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ముంబైలోని ఓ 72 ఏళ్ల వ్యాపారి నుంచి రూ. 58 కోట్ల భారీ మొత్తాన్ని దోచుకున్నారు. సైబర్ నేరగాళ్లు తాము ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులమని నమ్మబలికి, మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నారని ఆ వ్యాపారితో పాటు ఆయన భార్యను భయపెట్టి ఈ మోసానికి పాల్పడ్డారు.

ఆగస్టు 19, 2025న, మోసగాళ్ళు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఈ వ్యాపారిని, ఆయన భార్యను సంప్రదించారు.వీడియో కాల్స్‌లో యూనిఫామ్‌లు ధరించి నిజమైన అధికారులమని నమ్మించారు.వీరిని డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి, విచారణ నుంచి బయటపడాలంటే డబ్బు పంపాలని బెదిరించారు.దీంతో వ్యాపారి ఆగస్టు 19, అక్టోబర్ 8 మధ్య రెండు నెలల పాటు పలు దఫాలుగా రూ. 58 కోట్లను మోసగాళ్లు చెప్పిన వివిధ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశారు. 

వ్యాపారి మోసపోయినట్లు గుర్తించిన తర్వాత, సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.మహారాష్ట్ర సైబర్ డిపార్ట్‌మెంట్ ఈ కేసును దర్యాప్తు చేస్తూ ముగ్గురిని అరెస్టు చేసింది.దర్యాప్తులో భాగంగా, డబ్బును 18 వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు.ఈ కేసు ఇప్పటివరకు డిజిటల్ అరెస్ట్ మోసాలలో ఒక వ్యక్తికి జరిగిన అతిపెద్ద నష్టాలలో ఒకటిగా నివేదించబడింది.

Follow us on , &

ఇవీ చదవండి