Breaking News

భోజనం బాగాలేదు అన్నందుకు విద్యార్థులపై దాడి

అల్లూరి సీతారామరాజు జిల్లాలో భోజనం నాణ్యతపై ఫిర్యాదు చేసిన విద్యార్థులపై ప్రధానోపాధ్యాయుడు (HM) దాడి చేసిన ఘటన ఫిబ్రవరి 6, 2026న వెలుగులోకి వచ్చింది.

Published on: 06 Feb 2026 17:11  IST

అల్లూరి సీతారామరాజు జిల్లాలో భోజనం నాణ్యతపై ఫిర్యాదు చేసిన విద్యార్థులపై ప్రధానోపాధ్యాయుడు (HM) దాడి చేసిన ఘటన ఫిబ్రవరి 6, 2026న వెలుగులోకి వచ్చింది.

అల్లూరి సీతారామరాజు జిల్లా, జి.కె. వీధి మండలం, దారకొండ పంచాయతీలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల.గత కొన్ని రోజులుగా హాస్టల్‌లో అందిస్తున్న ఆహారం నాణ్యత సరిగా లేదని ఇద్దరు గిరిజన విద్యార్థులు ఫిర్యాదు చేశారు.ఆహారం బాలేదని ఫిర్యాదు చేసినందుకు ఆగ్రహించిన ప్రధానోపాధ్యాయుడు హేమచంద్ర, ఆ విద్యార్థులను తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని, గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 

Follow us on , &

ఇవీ చదవండి