Breaking News

చికిత్స పొందుతూ భర్త ..పెట్రోల్ పోసుకొని భార్య

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సింగరేణి ఉద్యోగి కుంబాల నరేశ్ (34), అతని భార్య మమత (29) ఆరు రోజుల వ్యవధిలో మరణించారు. 


Published on: 23 Feb 2026 10:04  IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సింగరేణి ఉద్యోగి కుంబాల నరేశ్ (34), అతని భార్య మమత (29) ఆరు రోజుల వ్యవధిలో మరణించారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం చంద్రపల్లికి చెందిన నరేశ్, నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన మమత 14 ఏళ్లు ప్రేమించుకుని, 14 నెలల క్రితం వివాహం చేసుకున్నారు. నరేశ్ గోదావరిఖని జీడీకే-1 గనిలో ట్రామర్‌గా పనిచేస్తున్నారు.

ఫిబ్రవరి 16న శివరాత్రి పూజల అనంతరం నిద్రమత్తులో ఉన్న నరేశ్, మెట్లపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి.కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్త పరిస్థితి విషమంగా ఉందని, ఆయన బతికే అవకాశం లేదని డాక్టర్లు చెప్పడంతో మనస్తాపం చెందిన మమత, ఫిబ్రవరి 17 రాత్రి కరీంనగర్ తీగలగుట్టపల్లి రైల్వే ట్రాక్ సమీపంలో పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరేశ్ కూడా పరిస్థితి విషమించి ఫిబ్రవరి 22 (ఆదివారం) మరణించారు

మమత ఆత్మహత్యకు భర్త పరిస్థితితో పాటు అత్తింటి వేధింపులు కూడా కారణమని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి