Breaking News

అమెరికా చరిత్రలో తొలిసారిగా ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ సంతకం కరెన్సీ నోట్లపై కనిపించనుంది

అమెరికా చరిత్రలో తొలిసారిగా ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ సంతకం కరెన్సీ నోట్లపై కనిపించనుంది. అమెరికా ట్రెజరీ విభాగం మార్చి 26, 2026న ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది.


Published on: 28 Mar 2026 10:19  IST

అమెరికా చరిత్రలో తొలిసారిగా ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ సంతకం కరెన్సీ నోట్లపై కనిపించనుంది. అమెరికా ట్రెజరీ విభాగం మార్చి 26, 2026న ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. 165 ఏళ్ల సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ, సాధారణంగా ఉండే ట్రెజరర్ సంతకం స్థానంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకం ఉండబోతోంది.

ఈ కొత్త నోట్ల ముద్రణ జూన్ 2026 నుండి ప్రారంభం కానుంది. మొదటగా 100 డాలర్ల నోటు విడుదలయ్యే అవకాశం ఉంది.2026లో అమెరికా జరుపుకోబోయే 250 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల (Sestercentennial) సందర్భంగా ఈ మార్పు చేస్తున్నట్లు ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తెలిపారు.

కొత్త నోట్లపై డొనాల్డ్ ట్రంప్ సంతకంతో పాటు, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ (Scott Bessent) సంతకం కూడా ఉంటుంది.సంతకం మినహా, నోట్ల యొక్క మిగిలిన డిజైన్ మరియు రంగులలో ఎలాంటి మార్పు ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి