Breaking News

ఓయూలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

ఉస్మానియా యూనివర్సిటీ (OU) క్యాంపస్‌లో నేడు (ఏప్రిల్ 27, 2026) ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 


Published on: 27 Apr 2026 16:31  IST

ఉస్మానియా యూనివర్సిటీ (OU) క్యాంపస్‌లో నేడు (ఏప్రిల్ 27, 2026) ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా గోవిందపురం గ్రామానికి చెందిన వినీశ్. ఈయన యూనివర్సిటీలో మైనింగ్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.సోమవారం ఉదయం క్యాంపస్‌లోని లేడీస్ హాస్టల్ సమీపంలో ఉన్న రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద వినీశ్తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

ప్రాథమిక విచారణ ప్రకారం, ఇది ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ఆవేదనతో జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వినీశ్ రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్‌లో ఒక యువతి తనను మోసం చేసిందని పేర్కొన్నట్లు సమాచారం.సుమారు 70 శాతం మేర కాలిపోయిన గాయాలతో వినీశ్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉంది. పోలీసులు మరియు తోటి విద్యార్థులు ఆయనను వెంటనే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఆయనకు చికిత్స అందుతోంది. 

 

Follow us on , &

ఇవీ చదవండి