Breaking News

విశాఖ వేదికగా గూగుల్ ప్రతిష్టాత్మక AI డేటా సెంటర్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శంకుస్థాపన

విశాఖపట్నం ఐటీ చరిత్రలో నేడు (28 ఏప్రిల్ 2026) ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. విశాఖ జిల్లా తర్లువాడ వేదికగా గూగుల్ ప్రతిష్టాత్మక AI డేటా సెంటర్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శంకుస్థాపన చేశారు. 

Published on: 28 Apr 2026 16:12  IST

విశాఖపట్నం ఐటీ చరిత్రలో నేడు (28 ఏప్రిల్ 2026) ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. విశాఖ జిల్లా తర్లువాడ వేదికగా గూగుల్ ప్రతిష్టాత్మక AI డేటా సెంటర్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శంకుస్థాపన చేశారు. 

గూగుల్ సంస్థ సుమారు $15 బిలియన్ల (దాదాపు రూ. 1.35 లక్షల కోట్లు) పెట్టుబడితో ఈ కేంద్రాన్ని నిర్మిస్తోంది.ఇది 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన మెగా డేటా సెంటర్. దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ హబ్‌గా ఇది అవతరించనుంది.

మొత్తం 600 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు విస్తరించి ఉంటుంది. విశాఖ జిల్లాలోని తర్లువాడ (266.6 ఎకరాలు), అడవివరం (160 ఎకరాలు) మరియు అనకాపల్లి జిల్లా రాంబిల్లి (17.80 ఎకరాలు) ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా దాదాపు 1.88 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఈ డేటా సెంటర్ రాకతో విశాఖపట్నం ఆసియాలోనే అతిపెద్ద ఏఐ హబ్‌గా మరియు గూగుల్ క్లౌడ్ సేవలకు గేట్‌వేగా మారుతుంది.గూగుల్ తన మూడు డేటా సెంటర్ల నిర్మాణాన్ని 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ మరియు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తదితరులు పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి