Breaking News

హైదరాబాద్‌లో ప్రజారోగ్యానికి హాని కలిగిస్తూ, అనుమతులు లేకుండా నడుస్తున్న కల్తీ పనీర్ తయారీ కేంద్రాలపై హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ భారీ దాడులు నిర్వహించారు.

హైదరాబాద్‌లో ప్రజారోగ్యానికి హాని కలిగిస్తూ, అనుమతులు లేకుండా నడుస్తున్న కల్తీ పనీర్ తయారీ కేంద్రాలపై హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్  మరియు పోలీసులు 18 జూన్ 2026న భారీ దాడులు నిర్వహించారు.


Published on: 18 Jun 2026 17:27  IST

హైదరాబాద్‌లో ప్రజారోగ్యానికి హాని కలిగిస్తూ, అనుమతులు లేకుండా నడుస్తున్న కల్తీ పనీర్ తయారీ కేంద్రాలపై హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్  మరియు పోలీసులు 18 జూన్ 2026 భారీ దాడులు నిర్వహించారు. ఈ మెరుపు తనిఖీల్లో భాగంగా అధికారులు సుమారు 825 కిలోల కల్తీ పనీర్ను స్వాధీనం చేసుకున్నారు.టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ నేతృత్వంలో అధికారులు నగరవ్యాప్తంగా 45 ప్రముఖ ఫుడ్ ఔట్‌లెట్లలో, అలాగే 8 పనీర్ తయారీ యూనిట్లలో ఏకకాలంలో దాడులు చేశారు.

కల్తీ నెట్‌వర్క్: కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి ఈ నకిలీ పనీర్ హైదరాబాద్‌కు సరఫరా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు.

మోసపూరిత లేబుళ్లు: నిందితులు నాసిరకం 'చీజ్ అనలాగ్' ఉత్పత్తులను పనీర్‌గా మారుస్తూ, వాటిపై 'ఫ్రెష్ పనీర్', 'లో-ఫ్యాట్ పనీర్' అని నకిలీ లేబుళ్లు వేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు.

నిబంధనల ఉల్లంఘన: ఈ తయారీ కేంద్రాలు ఎలాంటి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేదా ప్రభుత్వ అనుమతులు లేకుండానే అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో నడుస్తున్నట్లు గుర్తించారు.

స్వాధీనం చేసుకున్న పదార్థాలు

825 కేజీల కల్తీ పనీర్.హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంచిన భారీ మొత్తంలో నకిలీ చీజ్ మరియు ఇతర రసాయనాలు.లైసెన్స్ లేకుండా అక్రమంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటి నకిలీ తయారీ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement