Breaking News

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గ్రీస్ రాజధాని ఏథెన్స్ పర్యటనలో భాగంగా గ్రీస్‌లో మన భారతదేశ యూపీఐ సేవలు అధికారికంగా ప్రారంభించారు.

గ్రీస్‌లో మన భారతదేశ యూపీఐ (UPI) సేవలు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి.కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గ్రీస్ రాజధాని ఏథెన్స్ పర్యటనలో భాగంగా ఈ రోజు (30 జూన్ 2026) ఈ సేవలను ప్రారంభించారు.


Published on: 30 Jun 2026 17:51  IST

గ్రీస్‌లో మన భారతదేశ యూపీఐ (UPI) సేవలు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి.కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గ్రీస్ రాజధాని ఏథెన్స్ పర్యటనలో భాగంగా ఈ రోజు (30 జూన్ 2026) ఈ సేవలను ప్రారంభించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ , గ్రీస్‌కు చెందిన యూరోబ్యాంక్ భాగస్వామ్యంతో ఈ సేవలు లైవ్ అయ్యాయి.

గ్రీస్ యూపీఐ సేవల విశేషాలు

తక్కువ ఖర్చుతో లావాదేవీలు: సాధారణ అంతర్జాతీయ మనీ ట్రాన్స్‌ఫర్ ఛార్జీల కంటే చాలా తక్కువ ఖర్చుతో, సురక్షితంగా మరియు క్షణాల్లో డబ్బు బదిలీ చేసుకోవచ్చు.

ఎవరికి ఉపయోగం: గ్రీస్ వెళ్లే భారతీయ పర్యాటకులకు డిజిటల్ చెల్లింపులు సులభతరం అవుతాయి. అలాగే అక్కడ నివసించే వారు భారతదేశానికి తక్కువ ఖర్చుతో డబ్బులు పంపడానికి ఇది ఉపయోగపడుతుంది.

10 దేశంగా గ్రీస్: గ్రీస్‌తో కలిపి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10 దేశాల్లో మన యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

యూపీఐ సేవలు ఉన్న మిగతా 9 దేశాల జాబితా

సింగపూర్

యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)

ఫ్రాన్స్ (ఇటీవలే ఈఫిల్ టవర్, నైస్ నగరాల్లో ప్రారంభమైంది)

మారిషస్

నేపాల్

భూటాన్

ఖతార్

శ్రీలంక

కంబోడియా

Follow us on , &

ఇవీ చదవండి