Breaking News

ఉప రాష్ట్రపతి ఎన్నిక: ప్రారంభమైన పోలింగ్‌.. ఓటేసిన మోదీ

ఉప రాష్ట్రపతి ఎన్నిక: ప్రారంభమైన పోలింగ్‌.. ఓటేసిన మోదీ


Published on: 09 Sep 2025 10:38  IST

జగదీప్ ధన్‌ఖడ్‌ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి పదవికి పోలింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఈ ఎన్నికలో

  • ఎన్డీయే తరఫున సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan)

  • విపక్షాల సంఘం తరఫున జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి (B. Sudershan Reddy) పోటీ చేస్తున్నారు.

పోలింగ్ ప్రక్రియ పార్లమెంట్ కొత్త భవనం F-101 వసుధలో ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించారు.
ఓట్ల లెక్కింపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభించి రాత్రికి ఉప రాష్ట్రపతి ఎన్నిక ఫలితాన్ని ప్రకటిస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి