Breaking News

ఫిబ్రవరి వరకు సర్వీసులు తగ్గించండి


Published on: 09 Dec 2025 18:00  IST

ఫిబ్రవరి వరకు రోజువారీ విమాన సర్వీసులను తగ్గించుకోవాల్సిందిగా ఇండిగోను విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కోరే అవకాశం ఉంది. పైలట్ల కొరత కారణంగా తలెత్తిన సమస్యలతో ఈ నెలలో ఇప్పటివరకు 5000కు పైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో శీతాకాల షెడ్యూల్‌ కింద రోజుకు 300 విమాన సర్వీసులను తగ్గించుకోమని డీజీసీఏ ఆదేశించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Follow us on , &

ఇవీ చదవండి