Breaking News

భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా (NASA) వ్యోమగామి సునీతా విలియమ్స్ తన 27 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణానికి ముగింపు పలుకుతూ పదవీ విరమణ

భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా (NASA) వ్యోమగామి సునీతా విలియమ్స్ తన 27 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణానికి ముగింపు పలుకుతూ పదవీ విరమణ (Retirement) ప్రకటించారు. 


Published on: 21 Jan 2026 11:03  IST

భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా (NASA) వ్యోమగామి సునీతా విలియమ్స్ తన 27 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణానికి ముగింపు పలుకుతూ పదవీ విరమణ (Retirement) ప్రకటించారు. 

జనవరి 20, 2026న నాసా ఆమె రిటైర్మెంట్‌ను అధికారికంగా ధృవీకరించింది.ఆమె పదవీ విరమణ డిసెంబర్ 27, 2025 నుండి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు.

1998లో నాసాలో చేరిన సునీతా, గత 27 ఏళ్లుగా అంతరిక్ష పరిశోధన రంగంలో విశేష సేవలు అందించారు.ఆమె తన కెరీర్‌లో మొత్తం 3 సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లారు.మొత్తం 608 రోజులు అంతరిక్షంలో గడిపారు.

మొత్తం 9 సార్లు స్పేస్‌వాక్ (అంతరిక్ష నడక) చేసి, మహిళా వ్యోమగాములలో అత్యధిక సమయం స్పేస్‌వాక్ చేసిన వారిలో ఒకరిగా రికార్డు సృష్టించారు.2024 జూన్‌లో 8 రోజుల మిషన్ కోసం అంతరిక్షానికి వెళ్లిన ఆమె, సాంకేతిక కారణాల వల్ల దాదాపు 9 నెలల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. చివరకు మార్చి 2025లో సురక్షితంగా భూమికి చేరుకున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి