Breaking News

కాకినాడ పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా..


Published on: 21 Jan 2026 15:49  IST

తొండంగి మండలం ఏవీ నగరం పీబీసీ కాల్వలో ఓ స్పిరిట్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కాల్వలో స్పిరిట్ కలిసిపోయి నీరంతా కలుషితమైంది. పీబీసీ కాల్వ ద్వారా తొండంగి మండలంలోని 16 గ్రామాలకు తాగునీటి సరఫరా అవుతోంది. ఈ ప్రమాదం వల్ల ఏవీ నగరం పంపింగ్ స్కీమ్ నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. విషయం తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు.తాత్కాలికంగా ఆ నీటిని తాగవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి