Breaking News

అమృత్ ఉద్యాన్ (గతంలో మొఘల్ గార్డెన్స్) 2026 ఫిబ్రవరి 3 నుండి మార్చి 31 వరకు ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంటుంది. 

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని ప్రసిద్ధ అమృత్ ఉద్యాన్ (గతంలో మొఘల్ గార్డెన్స్) 2026 ఫిబ్రవరి 3 నుండి మార్చి 31 వరకు ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంటుంది. 


Published on: 22 Jan 2026 16:53  IST

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని ప్రసిద్ధ అమృత్ ఉద్యాన్ (గతంలో మొఘల్ గార్డెన్స్) 2026 ఫిబ్రవరి 3 నుండి మార్చి 31 వరకు ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంటుంది. 

వారంలో ఆరు రోజులు (మంగళవారం నుండి ఆదివారం వరకు) ఉదయం 10:00 నుండి సాయంత్రం 6:00 వరకు సందర్శించవచ్చు.సాయంత్రం 5:15 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు.నిర్వహణ పనుల కారణంగా ప్రతి సోమవారం మరియు మార్చి 4 (హోలీ) నాడు తోటను మూసివేస్తారు.

ప్రవేశం పూర్తిగా ఉచితం.సందర్శకులు visit.rashtrapatibhavan.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చు.డైరెక్ట్‌గా వెళ్లేవారి కోసం గేట్ నంబర్ 35 వద్ద సెల్ఫ్ సర్వీస్ రిజిస్ట్రేషన్ కియోస్క్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

సందర్శకులందరూ నార్త్ అవెన్యూ సమీపంలోని గేట్ నంబర్ 35 ద్వారా మాత్రమే లోపలికి వెళ్లాలి మరియు బయటకు రావాలి.సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ నుండి గేట్ నంబర్ 35 వరకు ప్రతి 30 నిమిషాలకు ఉచిత షటిల్ బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి