Breaking News

బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశమని ఉద్యమ నేత మీర్ యార్ బలూచ్ బుధవారం ప్రకటించారు.

బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశమని, తమను ఇకపై పాకిస్తానీలుగా కాకుండా బలూచిస్తాన్ పౌరులుగా గుర్తించాలని బలూచ్ ఉద్యమ నేత మీర్ యార్ బలూచ్ బుధవారం ప్రకటించారు.


Published on: 15 May 2025 10:07  IST

భారత్ చేపట్టిన "ఆపరేషన్ సిందూర్" తో పాకిస్థాన్‌ను కుదిపేస్తుండగా, ఇప్పుడు బలూచిస్తాన్ రాష్ట్రం నుంచి మరొక షాక్ తగిలింది. పాకిస్థాన్‌లో విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్తాన్‌కి చెందిన ప్రముఖ నేత మీర్ యార్ బలూచ్, తమ రాష్ట్రం ఇకపై పాకిస్థాన్‌లో భాగం కాదని బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశమని, తమను ఇకపై పాకిస్తానీలుగా కాకుండా బలూచిస్తాన్ పౌరులుగా గుర్తించాలని బుధవారం ప్రకటించారు. 

బుధవారం రోజు సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వరుస పోస్ట్‌లు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. “పాకిస్థాన్ నుంచి మేము విడిపోతున్నాం. బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశం. పాకిస్థాన్ హింస, అక్రమ అరెస్టులు, మానవ హక్కుల ఉల్లంఘనలతో మా ప్రజలను ఎన్నేళ్లుగా పీడిస్తోంది. ఇప్పుడు మేము స్వతంత్రతను ప్రకటిస్తున్నాం” అని స్పష్టంగా పేర్కొన్నారు.

బలూచ్ ఉద్యమ నాయకులు భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ బలూచిస్తాన్ ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, ఐక్యరాజ్యసమితి (UN) బలూచిస్తాన్‌ను "డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్" గా గుర్తించి, అక్కడ శాంతి బలగాలను తరలించాలని సూచించారు.

బలూచ్ నేతలు తమ రాష్ట్రంలో ఉన్న పాకిస్థాన్ భద్రతా బలగాలు, ప్రభుత్వ సిబ్బంది తక్షణమే బయలుదేరిపోవాలని హెచ్చరించారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి స్వతంత్రతకు మద్దతుగా నినాదాలు చేశారు. ఇది పాకిస్థాన్‌కు చాలా పెద్ద రాజకీయ పరాజయంగా మారే అవకాశముంది.

ఈ సందర్భంగా మీర్యార్ బలూచ్, పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ (పీవోకే)పై భారత్ చేస్తున్న కృషికి మద్దతుగా నిలుస్తున్నట్లు తెలిపారు. పీవోకే విషయంలో భారత్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు.

పాకిస్థాన్‌కి అంతర్గతంగా ఇది పెద్ద ఉద్రిక్తతగా మారే అవకాశం ఉంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ పరిస్థితి బలహీనమవుతోందని, ఇప్పుడు బలూచిస్తాన్ విషయమూ అంతే దిశగా పోతుందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి