Breaking News

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెబుతోంది..? కొత్త వేరియంట్...వెరీ డేంజరా..?

కరోనా మళ్లీ విజృంభించబోతోందా…? పాత శత్రువు కొత్త రూపం సంతరించుకుందా..? ఈ సారి వస్తే…అంత ఈజీగా వదలదా.?


Published on: 16 May 2025 08:49  IST

కొంతకాలంగా కొవిడ్ ప్రభావం తీవ్రంగా తగ్గినప్పటికీ కరోనా మళ్లీ తన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా నిపుణులు కొవిడ్ ప్రభావం తీవ్రంగా ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పాత వైరస్ మళ్లీ కొత్త రూపంతో ప్రత్యక్షమవుతోంది. ఇది గతంలో వచ్చిన వేరియంట్లలా సరళంగా తొలగిపోదని, మరింత అప్రమత్తత అవసరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచంలోని ప్రధాన ఆసియా దేశాల్లో ఇప్పటికే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హాంకాంగ్ మరియు సింగపూర్ వంటి నగరాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. హాంకాంగ్‌లో మే 3 తర్వాత నుంచి మరణాలు మరియు కేసుల సంఖ్య పెరుగుతున్నదని ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. రెండు సంవత్సరాలుగా తక్కువ స్థాయిలో ఉన్న కేసులు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. వైరల్ లోడ్ అధికంగా ఉండటం, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య కూడా పెరగడమే దీనికి కారణంగా చెబుతున్నారు.

సింగపూర్‌లోనూ కరోనా కేసులు గడచిన వారంతో పోల్చితే సుమారు 28 శాతం పెరిగాయి. మే 3 నుంచి వారాంతంలోనే కొత్త కేసులు 14,200 దాటినట్లు సమాచారం. రోజువారీ ఆసుపత్రిలో చేరే కేసులు 30 శాతం వరకూ పెరిగాయని తెలుస్తోంది. రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల వైరస్ మళ్లీ వ్యాపిస్తోందని అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది.

చైనా లో చైనా ఆరోగ్య అధికారుల ప్రకారం, కోవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. ప్రధాన నగరాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు గత ఐదు వారాల్లో రెట్టింపు అయిందని డేటా చెబుతోంది. దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి గత ఏడాది వేసవి మాదిరిగానే మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రకారం, కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 “వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్”గా గుర్తించబడింది. ఇది 2025లో 16.3% జన్యు విశ్లేషణలలో కనిపించింది. అదేవిధంగా LP.8.1, LB.1 అనే వేరియంట్లు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కేసులు తగ్గుతున్నప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

మన దేశంలోనూ కరోనా కేసులపై కొత్తగా వార్తలు వస్తున్నాయి. వృద్ధులు మరియు సహజ వ్యాధులతో బాధపడుతున్నవారిలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అపోలో హాస్పిటల్స్ విడుదల చేసిన "హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025" నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా 25 లక్షల మందిపై నిర్వహించిన పరిశీలనలో శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు పెరిగినట్టు తేలింది.

ఈ నేపథ్యంలో, వైద్య నిపుణులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మాస్క్‌లు ధరించడం, శానిటైజర్ వాడకాన్ని కొనసాగించడం, వ్యాక్సినేషన్ పూర్తిగా చేయించుకోవడం, అత్యవసరమైతే ఆసుపత్రిని సంప్రదించడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి