Breaking News

సన్‌రైజర్స్ జట్టు వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది.

వరుసగా నాలుగో పరాజయం కూడా నమోదైంది సన్‌రైజర్స్ కు ఇటీవల మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓడిపోయింది.ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచుల్లో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచిన సన్‌రైజర్స్


Published on: 07 Apr 2025 11:29  IST

ఐపీఎల్ 2025: వరుస పరాజయాలతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. మ్యాచ్‌ లో వరుసగా ఓటములు ఎదురవుతూ, జట్టు ప్రదర్శన మరింత దిగజారుతోంది. ఇటీవల గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ ఓడిపోయింది. ఈ ఓటమితో కలిపి వరుసగా నాలుగో పరాజయం కూడా నమోదైంది.

ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచుల్లో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచిన సన్‌రైజర్స్.. రెండు పాయింట్లతో పాయింట్స్ పట్టికలో చివర్లో ఉంది. జట్టు నెట్ రన్‌రేట్ -1.629గా ఉండటంతో పరిస్థితి మరింత కఠినంగా మారింది. ప్రస్తుతం కమిన్స్ సేనకు 9 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో కనీసం 7 మ్యాచ్‌లను గెలిస్తే మాత్రమే ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగవుతాయి.

ఐపీఎల్ చరిత్రను చూస్తే, గతంలో కొన్నేళ్లకు 14 మ్యాచ్‌లలో 7 లేదా 8 విజయాలు సాధించిన జట్లు ప్లేఆఫ్స్‌కు చేరిన సందర్భాలు ఉన్నాయి. గత సీజన్‌లో ఆర్సీబీ 7 విజయాలతోనే ప్లేఆఫ్స్‌కి చేరింది. అంటే, సన్‌రైజర్స్ ఇప్పటికీ పూర్తి గా నష్టపోలేదు.

మిగతా జట్ల ఫలితాలపై కూడా ఎస్‌ఆర్‌హెచ్ ప్లేస్ ఆధారపడే అవకాశం ఉన్నా, తన విజయాల్లో ఎక్కువ తేడాతో గెలవడం ద్వారా నెట్ రన్‌రేట్‌ను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఇప్పుడు జరగబోయే ప్రతి మ్యాచ్‌లో గట్టిగా ఆడి విజయాలను సాధించడం వల్లే ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే, కమిన్స్ సేన గత తప్పులన్నింటిని పక్కనబెట్టి, మిగిలిన మ్యాచ్‌లన్నిటిలో ఆత్మవిశ్వాసంతో ఆడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ సమతుల్యత సాధిస్తే జట్టుకు మంచి ఫలితాలు రావచ్చు. అన్ని లెక్కలు పక్కన పెట్టి ఒక్కో మ్యాచ్‌ను తలకాయిలా తీసుకుని ఆడితేనే విజయానికి దారి తెరుచుకుంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి