Breaking News

మొత్తం 8 మంది ఎమ్మెల్సీలు తొలిసారి శాసన మండలిలో అడుగు పెట్టబోతున్నారు.

మొత్తం 8 మంది ఎమ్మెల్సీలు తొలిసారి శాసన మండలిలో అడుగుపెడతున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారికి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.


Published on: 07 Apr 2025 14:07  IST

తెలంగాణ శాసన మండలి వేదికగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ఈరోజు తమ పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఎమ్మెల్యే కోటాల నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులు, శాసనమండలిలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

ఈ కార్యక్రమం ఉదయం 9:15 గంటల నుంచి 11:30 గంటల వరకు జరుగనుంది. మొత్తం 8 మంది ఎమ్మెల్సీలు తొలిసారి శాసన మండలిలో అడుగుపెడతున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారికి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

ఎవరు ఎక్కడినుంచి విజయం సాధించారంటే…

  • కాంగ్రెస్ పార్టీ తరఫున – విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్

  • సీపీఐ పార్టీ నుంచి – నెల్లికంటి సత్యం

  • బీఆర్‌ఎస్ పార్టీ తరఫున – దాసోజు శ్రవణ్ కుమార్ (ఏకగ్రీవంగా ఎన్నిక)

  • బీజేపీ తరఫున – కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో అంజిరెడ్డి, టీచర్‌ స్థానంలో మల్క కొమరయ్య

  • ఖమ్మం టీచర్ కోటా నుంచి – పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు.

వీరికి ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉన్నప్పటికీ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఖమ్మం టీచర్ కోటా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం పై కొంత స్పష్టత లేకపోవడం గమనార్హం. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, వీరిద్దరూ ఇంకొక రోజు ప్రమాణం చేసే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి