Breaking News

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా వక్ఫ్ చట్టం-2025 సవరణ బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

వక్ఫ్ చట్టం-2025 సవరణ బిల్లుపై దాఖలైన పిటిషన్లపై సోమవారం నాడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.


Published on: 07 Apr 2025 17:47  IST

న్యూ ఢిల్లీ: వక్ఫ్ చట్టంలో మార్పులు చేసే వక్ఫ్ సవరణ బిల్లు - 2025కి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అంగీకారం తెలపడంతో, ఇది అధికారికంగా చట్టంగా మారింది.ఈ బిల్లుపై లోక్‌సభలో సుమారు 14 గంటల పాటు విస్తృతంగా చర్చ జరిగింది. చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించగా, 288 మంది సభ్యులు బిల్లుకు మద్దతుగా, 232 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ప్రతిపక్షాల సమర్పించిన సవరణలు తిరస్కరించబడ్డాయి.ఇక బిల్లు చట్టంగా మారకముందే, కొందరు వ్యక్తులు మరియు సంస్థలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అభ్యంతరాలను ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనంలో ప్రస్తావించారు. ఆయన ఈ పిటిషన్లను త్వరగా విచారించాలంటూ కోర్టును కోరారు.

ఈ విషయంపై సోమవారం నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ, ఈ కేసును అత్యవసరంగా విచారించే అవసరం లేదని స్పష్టం చేశారు. అటువంటి విషయాలను నిర్వహించడానికి దేశంలో ఒక వ్యవస్థ అమలులో ఉందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

ఇదిలా ఉండగా, వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ పిటిషన్లు వేసినవారిలో ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. దీనిపై స్పందించిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకంగా లేదని, ఎవరి మత విశ్వాసాలకూ భంగం కలిగించలేదని స్పష్టంచేశారు.

Follow us on , &

ఇవీ చదవండి