Breaking News

ఏలియన్స్ నిజంగా ఉన్నారా? మార్స్‌పై బయటపడిన ఆకారాలపై కొత్త చర్చ

కొన్నేళ్ల క్రితం నాసా మార్స్ రీకొనైసెన్స్ ఆర్బిట్ అనే స్పేస్ క్రాఫ్ట్‌ను మార్స్‌పైకి పంపింది. అది కీ హోల్‌ను పోలి ఉన్న ఆకారాన్ని ఫొటో తీసింది. ఆ ఆకారం భూమిపై ఉండే ఓ పురాతన కట్టడాన్ని పోలి ఉండటంతో రచ్చ మొదలైంది.


Published on: 07 Apr 2025 12:07  IST

మన భూమిపై జీవం ఎలా మొదలైంది అన్న ప్రశ్నకు సమాధానాలు దొరకినప్పటికీ, భూమికి బయట జీవం ఉందా? అనే ప్రశ్న మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే కొనసాగుతోంది. 2025 సంవత్సరంలో కూడా ఏలియన్స్ ఉన్నారు అని చెప్పగలిగే ఖచ్చితమైన ఆధారాలు శాస్త్రవేత్తలకు లభించలేదు. శాస్త్ర పరిశోధనల్లో భాగంగా విశ్వంలో మనలాంటివారే ఉన్నారన్న వాదనకు ఎక్కువ మద్దతు ఉంది.

అయితే, కొన్ని ఆసక్తికర విషయాలు మాత్రం ఈ ఉహాగానాల్ని బలపరిచేలా ఉన్నాయి. ముఖ్యంగా మార్స్‌పై బయటపడిన కొన్ని ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఇవి కొన్నిసార్లు భూమిపై కనిపించే కొన్ని నిర్మాణాలను పోలి ఉండటం వల్ల, మార్స్‌పై ఏలియన్స్ ఉన్నారన్న ఊహాగానాలకు బలం చేకూరింది.

2011లో నాసా పంపిన "మార్స్ రీకానైసెన్స్ ఆర్బిటర్" అనే స్పేస్‌ క్రాఫ్ట్ మార్స్ ఉపరితలాన్ని పరిశీలిస్తూ ఓ విచిత్ర ఆకారాన్ని తన కెమెరాలో బంధించింది. అది తాళం కీ హోల్‌(Keyhole) ఆకారంలో ఉండటం విశేషం. ఇదే ఆకారం జపాన్‌లో ఉన్న కోఫున్ సమాధికి కూడా ఉంటుంది. దీంతో, మార్స్‌పై ఎప్పుడో ఏదో అభివృద్ధి జరిగినదా? అనే సందేహాలు పుట్టుకొచ్చాయి.ఈ ఫొటోపై పలు పరిశోధనలు జరిగాయి. రచయిత హాస్ దీన్ని విశ్లేషిస్తూ– ఇది సహజసిద్ధంగా ఏర్పడినదికాదని, ఇది ఉద్దేశపూర్వకంగా నిర్మించినదే అయ్యుండొచ్చని అభిప్రాయపడ్డారు. ఆయన చేసిన విశ్లేషణ ‘జర్నల్ ఆఫ్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్’ అనే శాస్త్రీయ పత్రికలో కూడా ప్రచురితమైంది.

విపరీతంగా స్పందించిన శాస్త్రవేత్తలు

ఇది చూసిన శాస్త్రవేత్తలు మాత్రం భిన్నంగా స్పందించారు. వారి అభిప్రాయం ప్రకారం, ఇది మెదడు చేసే ఆటలో భాగమే. "పారెడోలియా" (Pareidolia) అనే మెదడు సైకాలజీ ప్రకారం, మనకు తెలిసిన రూపాలను మన మెదడు అప్రమత్తంగా వెతుకుతూ, అసలు ఉన్నదానికన్నా వేరేలా భావిస్తుంది.

ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లింకన్‌కు చెందిన సైకాలజిస్ట్ రాబిన్ క్రామర్ ఈ విషయంపై మాట్లాడుతూ, ‘‘మార్స్‌పై కనిపించిన వింత ఆకారాలు నిజంగా వింతగా ఉండకపోవచ్చు. మన మెదడు కొన్ని రూపాలను కల్పన చేస్తూ, అవి మనకు ముఖాలని లేదా ఓ నిర్మాణాలని అనిపించేలా చేస్తుంది. ఇదే పారెడోలియా ప్రభావం’’ అని వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి