Breaking News

మోహ‌న్ బాబు ఇంటి ద‌గ్గ‌ర ఉద్రిక్త‌త ప‌రిస్థితులు గేటు వద్దే మంచు మనోజ్ కూర్చొని నిరసన

మోహ‌న్ బాబు ఇంటి గేటు తెర‌వ‌క‌పోవ‌డంతో గేటు వద్దే మంచు మనోజ్ కూర్చొని నిరసన తెలిపారు.నాకు ఆస్తి అవసరం లేదని,”ఈ వివాదం అంతా విద్యార్థుల భ‌విష్య‌త్తు కోస‌మే అని ఆయన తెలిపారు.


Published on: 09 Apr 2025 14:09  IST

మంచు మోహన్ బాబు కుటుంబంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాలు మరోసారి మంగళవారం తెరపైకి వచ్చాయి. నటుడు మంచు మనోజ్ తన కారును ఎవరో అపహరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది యాదృచ్ఛిక ఘటన కాదని, సోద‌రుడు విష్ణు దీని వెనుక ఉన్నారని ఆరోపించారు.బుధవారం ఉదయం, మంచు మనోజ్ మోహన్‌బాబు నివాసం ఉన్న జల్పల్లికి చేరుకున్నారు. ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినా గేట్ తెర‌వ‌క‌పోవ‌డంతో,ఆయన ఇంటి గేటు వద్దే కూర్చొని నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు పోలీసులు అక్కడే పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మనోజ్, ఇది ఆస్తి వివాదం కాదని స్పష్టం చేశారు. “ఏప్రిల్ 2న మా పాప పుట్టిన రోజు కుటుంబంతో కలిసి జరుపుకోవాలని వచ్చాం. కానీ పరిస్థితులు అనుకూలించక జైపూర్ వెళ్ళాల్సి వచ్చింది. నాన్నగారికి నేనే చెప్పాను – నాకు ఆస్తి అవసరం లేదని,” ఇదంతా విద్యార్థుల భ‌విష్య‌త్తు కోస‌మే . అక్క‌డే ఈ గొడ‌వ మొద‌లైంది.గత డిసెంబర్ నుంచి మన కుటుంబంలో అనేక సంఘర్షణలు జరుగుతున్నా ఇప్పటివరకు పోలీసుల నుండి తగిన చర్యలు రావడం లేదన్నారు. "కత్తులు, గన్‌లతో మా మీద దాడి చేయడానికి వచ్చారు. దీన్ని నిర్ధారించే ఆధారాలను కూడా పోలీసులకు అందించాను" అని ఆయన తెలిపారు.

నా ఇంటిలోకి నేను వెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంపై మనోజ్ తీవ్రంగా స్పందించారు. “న్యాయస్థానం ఆదేశాలున్నా, నన్ను ఇంట్లోకి రానివ్వడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పందించాలి,” అని డిమాండ్ చేశారు.అంతేగాక, ఇంట్లో ఉన్న తన పెంపుడు కుక్క పిల్లలను కూడా తీసుకెళ్లడానికి అనుమతించకపోవడం తనకు బాధ కలిగించిందన్నారు. "నేను ఎప్పుడూ ఆస్తి కోసం పోరాడలేదు. తల్లిగారిపై ప్రమాణం చేస్తున్నా – విష్ణుకి నాపై ద్వేషం ఉంది. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు సంతకాలు ఉపయోగిస్తున్నారు," అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి