Breaking News

హైదరాబాద్ నిమ్స్‌లో అగ్నిప్రమాదం – ఐదవ అంతస్తులో మంటలు

నిమ్స్ ఆస్పత్రి ఎమర్జెన్సీ విభాగంలో 5వ అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం


Published on: 19 Apr 2025 17:31  IST

హైదరాబాద్, ఏప్రిల్ 19: నగరంలోని ప్రముఖ నిమ్స్‌ ఆస్పత్రిలో శుక్రవారం ఒక అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రి ఎమర్జెన్సీ విభాగంలోని ఐదవ అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆస్పత్రి చుట్టూ గట్టి పొగలు అలుముకున్నాయి.

ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆస్పత్రికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు.  5వ  అంతస్తులో విద్యుత్ ప్యానల్స్ ఉన్నట్టు సమాచారం.

ఆస్పత్రి సిబ్బంది వెంటనే స్పందించి, మంటలు చెలరేగిన ఐదవ అంతస్తులో ఉన్న రోగులను ఇతర వార్డులకు సురక్షితంగా తరలిస్తున్నారు. ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ఘటనతో ఆస్పత్రి పరిసరాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. అయితే ఇప్పటి వరకు ప్రాణ నష్టం జరిగిందనే సమాచారం లేదు.

Follow us on , &

ఇవీ చదవండి