Breaking News

మేరఠ్‌ మర్డర్ మిస్టరీ - ఆమె భర్తను చంపింది పాము కాదు..

పాము కాటు వేసింద్ అనే ముసుగు లో భర్త అమిత్‌ని భార్య రవిత, ఆమె ప్రియుడు అమర్‌దీప్‌ తో కలిసి దారుణంగా హత్య చేసింది.


Published on: 19 Apr 2025 18:07  IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మేరఠ్ జిల్లాలో అమిత్ కశ్యప్ అనే వ్యక్తి మృతిపై పెద్ద చర్చ నడుస్తోంది. మొదట ఆయనను పాము కరిచినట్టు వార్తలు రాగా… పోస్ట్‌మార్టం నివేదికతో విషయం పూర్తిగా తలకిందులైంది. అసలు అమిత్ ఊపిరాడకపోవడం వల్ల చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించడంతో ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది.పోలీసుల దర్యాప్తులో భర్త అమిత్‌ హత్యకు భార్య రవిత, ఆమె ప్రియుడు అమర్‌దీప్‌లు మూలకారణులని తేలింది. ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు… వారు నేరాన్ని అంగీకరించినట్టు తెలిపారు.

అమిత్‌ రాత్రి సమయంలో నిద్రలో ఉన్నప్పుడు, రవిత-అమర్‌దీప్ కలిసి అతనిని హత్య చేశారు. తర్వాత ఈ హత్యను పాము కాటు మరణంగా చూపించేందుకు, అమిత్ మృతదేహం కింద ఒక పామును ఉంచినట్టు పోలీసులు వెల్లడించారు. దాదాపు ఒకటిన్నర మీటరు పొడవున్న ఆ పాము నలిగిపోయి కనిపించింది. ఇది ఎక్కడ నుంచి వచ్చిందో అనే విషయమై ఇంకా విచారణ జరుగుతోంది.

రవిత, అమర్‌దీప్‌కు గతంలో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారినట్టు సమాచారం. రవిత అంగీకార ప్రకారం, ఆమె భర్త తరచూ గొడవపడేవారని, తన ప్రేమికుడితో కలిసి ఈ ఘోరానికి పాల్పడిందని చెబుతోంది.అమిత్ కుటుంబ సభ్యులు ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. "మా కొడుకు పాము వల్ల కాదు... మనిషి నీచత్వం వల్ల చనిపోయాడు. ఈ కేసులో నిందితులకు మరణశిక్ష విధించాలి" అని అమిత్ తండ్రి విజయ్‌పాల్ కశ్యప్ తీవ్ర స్థాయిలో స్పందించారు.

Follow us on , &

ఇవీ చదవండి