Breaking News

నెలకు 100, 500, 1000 జమ చేస్తే ఎంతొస్తుంది? వడ్డీ ఎంత

పోస్టాఫీసు అందిస్తోన్న ఈ పథకంలో మీరు నెల నెలా కొంత డబ్బు జమ చేసుకోవచ్చు. ప్రస్తుతం మీకు బ్యాంకులకు మించి వడ్డీ రేట్లు ఇక్కడ లభిస్తున్నాయి. అదే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం. ఇందులో మీకు నచ్చిన విధంగా నెలకు రూ.100, రూ.500, రూ.1000 చొప్పున జమ చేసుకోవచ్చు.


Published on: 14 Aug 2025 17:51  IST

సామాన్య ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలను అందిస్తోంది. పోస్టాఫీసులు, బ్యాంకుల ద్వారా ఈ పథకాల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రజలు తమ అవసరాలను బట్టి ఏ పథకం సరైనదో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. నెల నెల కొద్ది కొద్దిగా పొదుపు చేయాలని చాలా మంది అనుకుంటారు. రోజు వారీ కూలీలు కష్టపడి సంపాదించిన దాంటో రూ.100, రూ.500 అంటూ జమ చేయాలనుకుంటారు. కానీ, ఎక్కడ దాచుకోవాలో తెలియగా ఇంట్లో పెట్టి ఖర్చులు చేస్తుంటారు.

వారికి పోస్టాఫీసు పథకాలు సరైన మార్గంగా చెప్పవచ్చు. ప్రస్తుతం బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ రేటు ఇక్కడ వస్తోంది. కొద్ది కొద్దిగా నెల నెలా జమ చేసుకుంటూ ఒకేసారి పెద్ద మొత్తంలో అందుకోవాలనుకునే వారికి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం మంచి ఎంపిక. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ( Recurring Deposit Scheme) ఖాతాలో కనీసం రూ.100 ఇన్వెస్ట్ చేయాలి. గరిష్ఠంగా మీ తాహత ప్రకారం ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రస్తుతం 6.7 శాతం మేర వడ్డీ లభిస్తోంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. మెచ్యూరిటీ కాలం ముగిశాక మరో 5 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి