Breaking News

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.. మరి ప్రతి నెలా అందులో డబ్బులు జమవుతున్నాయా లేదా.

ఈపీఎఫ్ఓ ఇటీవలి కాలంలో సర్వీసుల్ని మరింత సులభతరం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు యూఏఎన్- ఆధార్ లింకింగ్ ప్రక్రియను కూడా సులువుగా మార్చేసింది. ఇక్కడ ఆధార్‌ వివరాలు సరిగా ఉంటే.. యూఏఎన్‌కు కేవైసీగా చేసుకోవచ్చు. తేడా ఉంటే జాయింట్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ ఈపీఎఫ్ఓ ఆమోదం ప్రత్యేకంగా అవసరం లేదు.


Published on: 14 Aug 2025 18:05  IST

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.. మరి ప్రతి నెలా అందులో డబ్బులు జమవుతున్నాయా లేదా.. పీఎఫ్ వివరాలు సరిగా లేకుండా ఇది నిలిచిపోతుందని చెప్పొచ్చు. అందుకే అన్నీ సరిగ్గా ఉండాలి. ముఖ్యంగా ఈపీఎఫ్ యూఏఎన్‌కు (యూనివర్సల్ అకౌంట్ నంబర్) ఆధార్ సీడింగ్ తప్పనిసరి. ఒకప్పుడు దీనికి యజమాని, ఈపీఎఫ్ఓ ఆమోదం కావాల్సి ఉండేది. దీంతో ఏదైనా అప్డేట్ చేయాల్సి వస్తే రోజులకు రోజులు పట్టేది. కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ తమ చందాదారులకు శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్ యూఏఎన్‌కు. ఆధార్‌ను కేవైసీగా లింక్ చేసే ప్రాసెస్ ఇప్పుడు సులభతరమైంది.

దీని వల్ల ఇప్పుడు తమ వివరాల్లో ఏం తేడా లేని వారు .. తమ ప్రొఫైల్‌ను నేరుగా అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా యజమాని, ఈపీఎఫ్ఓ ఆమోదం అక్కర్లేదు. గతంలో ఈ ఆమోదం కోసమే రోజుల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్త అప్డేట్ 2025, ఆగస్ట్ 13 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటి మార్పులతో ఉద్యోగులు.. తమ వివరాల్ని మరింత వేగంగా సవరించుకునేందుకు అవకాశం ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి