Breaking News

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన యంగ్ టైగర్ యన్టీఆర్ నటించిన తొలి హిందీ చిత్రం ఎలా ఉందంటే

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన యంగ్ టైగర్ యన్టీఆర్ నటించిన తొలి హిందీ చిత్రం కావడం, అందునా మాచో మేన్ హృతిక్ రోషన్ తో యన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోవడం, తారక్-హృతిక్ ఇద్దరూ మంచి డాన్సర్స్ అవ్వడం- వార్ 2 మూవీపై అందరిలోనూ ఆసక్తిని పెంచింది. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన స్పై మూవీ 'వార్ 2' చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఆగస్టు 14 శుక్రవారం 'వార్ 2' ప్రేక్షకులను పలకరించింది.


Published on: 14 Aug 2025 18:19  IST

భారత మాజీ ఇంటెలిజెన్స్ ఏజెంట్ కబీర్ ధలీవాల్ (హృతిక్)పై దేశద్రోహి ముద్ర పడుతుంది. తనను ఎంతగానో ప్రోత్సహించిన కర్నల్ సునీల్ లూత్రా (అశుతోశ్ రానా)ను కబీర్ కాల్చి చంపుతాడు. దీంతో కబీర్‌ వల్ల దేశానికి ప్రమాదం ఎదురు కాబోతోందని తెలిసి ప్రభుత్వం రా అఫీసర్ గా విక్రాంత్ కౌల్ (అనిల్ కపూర్)తో పాటు స్పెషల్ యూనిట్స్ ఆఫీసర్ విక్రమ్ (ఎన్టీఆర్)ను రంగంలోకి దింపుతుంది. తన తండ్రి సునీల్ లూత్రాను చంపిన కబీర్ ను మట్టుపెట్టడానికి వింగ్ కమాండర్ అయిన కావ్యా లూత్రా (కైరా అద్వానీ) కూడా రంగంలోకి దిగుతుంది. మరి వీరందరూ కలసి కబీర్ ఆట కట్టించారా? భారత దేశాన్ని నాశనం చేయాలని కలిగా ఫామ్ అయిన ఇండియా చుట్టు పక్క దేశాల్లోని ప్రముఖులు ఆడిన ఆటను కబీర్ ఎలా ఎదొర్కొన్నాడు. అసలు కబీర్-విక్రమ్ మధ్య రేస్ లో గెలిచిందెవరు!? ఈ స్పై యూనివర్స్ ఎలాంటి మలుపులు తీసుకుందన్నదే ‘వార్ 2’ కథాంశం.

'వార్'లో తాను ధరించిన మేజర్ కబీర్ ధలీవాల్ గానే హృతిక్ రోషన్ ఇందులోనూ కనిపించారు. విక్రమ్ పాత్రలో యన్టీఆర్ నటించారు. 'వార్'లో కబీర్ కు పోటీదారుగా కెప్టెన్ ఖలీద్ గా టైగర్ ష్రాఫ్ నటంచాడు. ఇక ‘వార్ 2’లో కబీర్ కు పోటీదారుగా నిలచిన విక్రమ్ పాత్రధారి యన్టీఆర్ కంటే హృతిక్ 9 ఏళ్ళు వయసులో పెద్ద. అయినా అతని ఫిజిక్ కు తగ్గ ముఖకవళికలు ఉన్నాయి. అయితే ఎందుకో ఏమో యన్టీఆర్ ముఖం ఇందులో కొద్దిగా పీక్కుపోయినట్టు అనిపించింది! కియారా అద్వానీ అందాల ఆరబోతకే పరిమితం కాకుండా కథలో కీలక పాత్ర పోషించింది. బాబీ డియోల్ చివరలో కేమియో రోల్ లో మెరుస్తాడు. అటు హృతిక్ ఇటు ఎన్టీఆర్ ఇద్దరూ పోటీపడి నటించారు. నిజానికి ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో ఇది మంచి ల్యాండింగ్ సినిమా అనే చెప్పాలి. హృతిక్ పాత్రకు దీటుగానే ఎన్టీఆర్ పాత్రను మలిచాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ.

ప్రీతమ్ స్వరాల్లో రూపొందిన ‘ఊపిరి ఊయలగా..’, ‘సలామ్ అనాలి..’ అంటూ సాగే రెండు పాటలు సినిమాలో ఉన్నాయి. అయితే 'సలామ్ అనాలి..' పాటలో ఇద్దరు హీరోల డాన్స్ మూవ్ మెంట్స్ చూడాలని యావత్ ఇండియా ఎంతగానో వెయిట్ చేసింది. అయితే సినిమాలో మాత్రం ఇది తుస్సు మనిపించేలా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్, చరణ్ చేసిన డాన్స్ చూసిన ప్రేక్షకులకు ఇందులో పాట ఏ మాత్రం ఆనదనే చెప్పాలి. ఇద్దరు ఇండియన్ బెస్ట్ డాన్సర్స్ ని పెట్టుకుని ఆకట్టుకునేలా తీయటంలో దర్శకనిర్మాతలు ఘోరంగా విఫలమయ్యారు. ఇక ఊపిరి ఊయలగా పాట ఎలా ఉన్నా కియారా అందాల ఆరబోత మాత్రం కనువిందు చేస్తుంది. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకె. బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫి కథను నడిపించేలా సాగింది.

అయితే ఫైట్ సీక్వెన్స్‌ మాత్రం కార్టూన్ సినిమాకు ఎక్కువ ఫీచర్ ఫిల్మ్ కు తక్కువ అన్నట్లు సాగింది. నిజానికి మంచి కథను ఎంపిక చేసుకుని దానికి తగ్గట్లు స్కీన్ ప్లే అల్లుకుని ఉంటే నెవర్ బిఫోర్ అనిపించేది. ‘వార్’ కథనే అటు తిప్పి ఇటు తిప్పి తీసినట్లు అనిపిస్తుంది. ‘వార్’లో కెప్టెన్ ఖలీద్ (టైగర్ ష్రాఫ్) చనిపోకుండా ఉంటే ఎలా ఉంటుందో ఈ ‘వార్2’ అలా ఉంటుంది అనటంల ఓ ఎలాంది సందేహం లేదు. 'వార్' డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ పనితీరుతో పోలిస్తే అయాన్ ముఖర్జీ తన దరిదాపుల్లో కూడా రాడేమో అనిపిస్తుంది. ‘వార్2’ అంచనాలకు ఏ మాత్రం దగ్గరగా లేకున్నా చివరలో స్పై మూవీస్ అన్నింటినీ ప్రస్తావిస్తూ కబీర్, పఠాన్, టైగర్, రఘ, ఆల్ఫా అన్ని పాత్రలతో సినిమా రావచ్చని హింట్ ఇవ్వటం ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచింది.

Follow us on , &

ఇవీ చదవండి