Breaking News

భారత్‌పై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదని మోదీ హెచ్చరిక

ఉగ్రవాదంపై తీవ్ర స్థాయిలో స్పందించిన ప్రధాని మోదీ – భారత్‌కి జరిగిన దాడికి ప్రతీకారం తప్పదని హెచ్చరిక


Published on: 25 Apr 2025 11:53  IST

భారత్‌పై దాడి చేసిన ఉగ్రవాదులకు గట్టి మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బీహార్‌ పర్యటనలో భాగంగా గురువారం జరిగిన సభలో ఆయన ఉగ్రదాడిపై స్పందిస్తూ, ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదని.. దేశంపై జరిగిందని అభిప్రాయపడ్డారు. అమాయకుల ప్రాణాలను బలిగొన్న వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, వారు చేసిన తప్పుకు గట్టి మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ప్రపంచం ఊహించని స్థాయిలో భారత్ ప్రతీకారం చూపనుందని, దేశ ప్రజల భద్రతే తనకు మొదటి ప్రధానమని మోదీ స్పష్టం చేశారు. ప్రతి ఒక్క ఉగ్రవాదిని ఏరిపారేసే వరకు పోరాటం కొనసాగుతుందని, ఉగ్రవాదాన్ని నేలమట్టం చేయాలని పటిష్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇకనైనా ఉగ్రవాదం పై కఠినంగా వ్యవహరించే సమయం వచ్చిందని, ఉగ్ర నేతలు సహా ఎవర్నీ ఉపేక్షించేది లేదని మోదీ స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి