Breaking News

పెహల్‌గామ్‌ దాడి తర్వాత అప్రమత్తమైన భారత సైన్యం – భద్రతా చర్యలు ఉధృతం

ఉగ్రదాడి నేపథ్యంలో అప్రమత్తమైన భారత్‌ పారామిలిటరీ దళాల సెలవులు రద్దు చేశారు మరియు సెలవుపై వెళ్లిన సైనికులను వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు.


Published on: 25 Apr 2025 17:07  IST

పెహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌ సరిహద్దులపై మరింత అప్రమత్తమైంది. పరిస్థితి తీవ్రమవుతున్న నేపథ్యంలో పారామిలిటరీ దళాలకు ఇవ్వబడ్డ సెలవులను రద్దు చేశారు. ఇప్పటికే సెలవుపై ఉన్న సిబ్బంది వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు.

జమ్మూ కశ్మీర్‌ పరిస్థితులపై వివిధ మిలిటరీ విభాగాలు ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాయి.ఇక రాష్ట్రవ్యాప్తంగా భద్రతను గట్టిగా ఏర్పాటు చేశారు. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌తో పాటు, లోయ మొత్తం భద్రతా దళాల పర్యవేక్షణలోకి వెళ్లిపోయింది. అనుమానాస్పద ప్రాంతాల్లో సైనికుల కదలికలు పెరిగాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.విమాన స్థావరాల్లో యుద్ధ విమానాలు అప్రమత్తంగా సిద్ధంగా ఉంచారు. నావిక దళం సముద్ర తీర ప్రాంతాల్లో యుద్ధ నౌకలను మోహరిస్తోంది. సరిహద్దుల్లో వేలాదిమంది సైనికులను కదిలించారు. భారత్‌ అన్ని రకాల ప్రమాద పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది.

ఇక తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది కశ్మీర్‌ చేరుకున్నారు. శ్రీనగర్‌, ఉదమ్‌పూర్‌ ప్రాంతాల్లో పర్యటించనున్న ఆయన, ఆర్మీ కమాండర్లు మరియు భద్రతా సంస్థల అధికారులతో భేటీ కానున్నారు. ఎల్ఓసీ పరిసరాల్లో పరిస్థితులపై సమీక్ష చేసి, తదుపరి కార్యాచరణపై మార్గదర్శనం ఇవ్వనున్నారు. పెహల్‌గామ్‌ దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి