Breaking News

భారతదేశ విమానాలు తమ గగనతలంలోకి రాకూడదని పాక్ స్పష్టంగా ప్రకటించింన పాక్

భారతదేశ విమానాలు తమ గగనతలంలోకి రాకూడదని పాక్ స్పష్టంగా ప్రకటించడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణిస్తున్న అంతర్జాతీయ విమానాలు


Published on: 25 Apr 2025 14:53  IST

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటన అనంతరం భారత్ పాక్‌పై ఆంక్షలు విధించగా, పాకిస్థాన్ కూడా అదే రీతిలో ప్రతిస్పందించింది. భారతదేశ విమానాలు తమ గగనతలంలోకి రాకూడదని పాక్ స్పష్టంగా ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి విమానయాన సంస్థలు తమ కార్యకలాపాల్లో మార్పులు చేసుకోవాల్సి వచ్చింది.

ఎయిర్ ఇండియా స్పందన:

ఉత్తర అమెరికా, యూరప్, బ్రిటన్, మధ్య పలు దేశాల నుంచి భారత్‌కు వస్తున్న విమానాలు పాక్ గగనతలాన్ని దాటకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి రావడంతో ఆలస్యం జరుగుతోందని ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణికులు ముందుగానే తమ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించింది. ప్రయాణ సమయాలు పెరగడంతో ప్రయాణికులకు ఏర్పడిన అసౌకర్యం పట్ల ఎయిర్ ఇండియా మన్నించమని కోరింది. సిబ్బంది, ప్రయాణికుల భద్రత తమకు ప్రాధాన్యత అని కూడా స్పష్టం చేసింది.

ఇండిగో ప్రకటన:

ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా పాక్ తీసుకున్న నిర్ణయంతో తమ విమానాల షెడ్యూల్‌పై ప్రభావం పడుతోందని తెలిపింది. ప్రయాణికులకు కలిగిన ఇబ్బందిని  పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది.

విమాన ఛార్జీల పెరుగుదల:

విమానాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి రావడంతో ప్రయాణ సమయం పెరగడం, ఇంధన వినియోగం అధికమవడం వల్ల టికెట్ ధరలు పెరుగుతున్నాయని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

భారత్‌ నిర్ణయాలు:

ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారత్ పాకిస్థాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు, భారత్‌లోని పాక్ దౌత్యవేత్తను దేశం విడిచిపోవాలని చెప్పింది.

పాక్ ప్రత్యుత్తరం:

దీనికి ప్రతిగా పాకిస్థాన్ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసినట్టు ప్రకటించింది. అదే విధంగా భారత విమానాలు తమ గగనతలాన్ని ఉపయోగించరాదని స్పష్టం చేసింది. దీంతో భారత్ నుంచి వెళ్లే అంతర్జాతీయ విమానాలు ఇతర మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం, ఖర్చులు రెండూ పెరిగాయి.

Follow us on , &

ఇవీ చదవండి