Breaking News

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినా నౌకాదళం లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్ష్ పై ట్రోల్

జబల్‌పూర్‌కు చెందిన ఒసఫ్ ఖాన్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయినా నౌకాదళం లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్ష్ ఉన్న ఫోటోపై తన సోషల్ మీడియా ఖాతాలో ట్రోల్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.


Published on: 25 Apr 2025 15:52  IST

భోపాల్, ఏప్రిల్ 25: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో భారత నౌకాదళం లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మృతిచెందిన ఆయన భౌతికకాయం పక్కన భార్య హిమాన్ష్ కన్నీరుమున్నీరవుతూ కనిపించిన దృశ్యం సోషల్ మీడియాలో చలించిపోయేలా మారింది. ఈ ఫోటో విస్తృతంగా వైరల్ కావడం, పలువురిని కదిలించిందంటే.. కొంతమంది మాత్రం దానిని అసభ్యంగా ట్రోల్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

జబల్‌పూర్‌కు చెందిన ఒసఫ్ ఖాన్ అనే వ్యక్తి ఈ ఫోటోపై తన సోషల్ మీడియా ఖాతాలో అసత్య, దుర్మార్గపు వ్యాఖ్యలు చేశాడు. అతను హిమాన్ష్‌పై అనవసర అనుమానాలు వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్లు తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. నెటిజన్లు తీవ్రంగా స్పందించడంతో, అభయ్ శ్రీవాస్తవ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఖాన్‌పై కేసు నమోదు చేసి, పోలీసులు అరెస్టు చేశారు. అతడు వైద్య వృత్తిలో ఉన్న వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, హర్యానాకు చెందినవారు. ఏప్రిల్ 16న హిమాన్ష్‌తో వివాహం చేసుకున్న ఈ జంట, ఏప్రిల్ 19న రిసెప్షన్ నిర్వహించారు. హనీమూన్ కోసం వారు కాశ్మీర్‌లోని పహల్గాంలో బస చేశారు. పర్యటన సందర్భంగా వారు చేసిన డ్యాన్స్ వీడియో కూడా అంతకుముందు వైరల్ అయింది. కానీ పలు అనుకోని సంఘటనలు వారి జీవితాన్ని మాయచేసాయి.

బయట బేల్ పూరి తింటూ ఉండగా ఉగ్రవాదులు అక్కడికి చేరుకుని, "మీరు ముస్లింలా?" అని ప్రశ్నించారు. సమాధానం ఇచ్చేలోపే వినయ్‌పై కాల్పులు జరిపారు. భర్తను కళ్ల ముందే పోగొట్టుకున్న హిమాన్ష్ ఆవేదన ఆ దృశ్యంలో ప్రతిబింబించింది. ఆ కన్నీటి క్షణాన్ని కొందరు మనుషులు మానవత్వం మరిచి ట్రోల్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి