Breaking News

ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ తొలి విజయం.. KTR ఇంట్రెస్టింగ్ ట్వీట్

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కృష్ణా జలాల వివాదం తారా స్థాయికి చేరింది. ఈ క్రమంలో మాజీ మంత్రి KTR ఆసక్తికర ట్వీట్ చేశారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన "ఛలో నల్గొండ" సభ సృష్టించిన ఒత్తిడి వల్ల కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించట్లేమని నేడు అసెంబ్లీలో తీర్మానం చేయనున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ సాధించిన తొలి విజయం అంటూ KTR ట్వీట్ చేశారు.


Published on: 12 Feb 2024 14:48  IST

కాగా, KTR ట్వీట్ చేసిన కాసేపటికే.. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ మేరకు జల వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ లోప్రకటించారు. షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన వాటా కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ మేరకు ప్రాజెక్టుల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక ప్రభుత్వ నిర్ణయం పై ప్రతిపక్ష సభ్యుడు హరీష్ రావు హర్షం వ్యక్తం చేసారు. ఇది ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ విజయమని హరీష్ రావు అన్నారు.
     

Follow us on , &

ఇవీ చదవండి