Breaking News

ఒక వైపు ఇండియా, మరో వైపు బలుచిస్తాన్‌.. పాకిస్థాన్‌! వాయించి వదిలిపెడుతున్నారు..

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్‌లో కలకలం – బలూచ్ దాడులతో 14 మంది సైనికుల మృతి


Published on: 08 May 2025 14:08  IST

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రభావం పాకిస్థాన్‌లో తీవ్రంగా కనిపిస్తోంది. ఈ దాడుల ప్రభావంతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరైన పాక్‌ను ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) మరింత అస్తవ్యస్తం చేస్తోంది. గురువారం బలూచిస్తాన్ రాష్ట్రంలోని బోలాన్, కెచ్ ప్రాంతాల్లో రెండు వేర్వేరు దాడులు జరిగాయి. వీటికి BLA బాధ్యత వహించింది.మొదటి దాడి బోలాన్‌లోని మాచ్ ప్రాంతంలోని షోర్కాండ్ వద్ద జరిగింది. ఇక్కడ పాక్ సైనిక కాఫిలాపై రిమోట్ కంట్రోల్డ్ బాంబుతో (IED) విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్ తారిఖ్ ఇమ్రాన్, సుబేదార్ ఉమర్ ఫరూక్ సహా మొత్తం 12 మంది పాక్ సైనికులు మరణించారు. వారి వాహనం పూర్తిగా ధ్వంసమైంది.రెండో దాడి కెచ్ జిల్లాలోని కులగ్ టిగ్రాన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇక్కడ పాక్ ఆర్మీకి చెందిన బాంబ్ డిస్పోజల్ టీమ్‌ను లక్ష్యంగా చేసుకుని మరోసారి రిమోట్ కంట్రోల్డ్ పేలుడు పరికరం ఉపయోగించారు. ఈ దాడిలో మరో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

బలూచ్ ఉద్యమం వెనుక పరిస్థితి

బలూచిస్తాన్ ప్రాంతం పాకిస్థాన్‌లో వేర్పాటు వాదం బలంగా ఉన్న ప్రావిన్స్. కొన్ని దశాబ్దాలుగా అక్కడి వాసులు ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్‌తో పోరాడుతున్నారు. కానీ పాకిస్థాన్ సైన్యం తీవ్రంగా అణచివేస్తూ వస్తోంది. ఇప్పటికీ ఆ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇక ఇటీవలి కాలంలో పాకిస్థాన్ తీవ్రవాద కార్యకలాపాలకు ఆశ్రయం ఇస్తోందన్న విమర్శలు భారత ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేశాయి. పహల్గామ్ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంతో భారత ప్రభుత్వం ప్రతీకారం తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఫలితంగా "ఆపరేషన్ సిందూర్" పేరిట ఉగ్రవాద స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ సైన్యం అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడిలో పడింది. ఇదే సమయాన్ని వాడుకుంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు ముమ్మరం చేయడం గమనార్హం.

ఇండియా నుంచి ఒత్తిడి, లోపల నుంచి బలూచ్ తిరుగుబాటుతో పాకిస్థాన్‌ ప్రభుత్వాన్ని తీవ్ర సంక్షోభంలో కూర్చేస్తోంది. ఈ పరిస్థితుల్లో శాంతిని కోరుకుంటే పాక్ ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం మానేయాలి. అంతేకాదు, బలూచిస్తాన్ ప్రజల ఆకాంక్షలకు గౌరవం ఇచ్చి, రాజకీయ పరిష్కార మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం మరింత ఎక్కువైంది.

Follow us on , &

ఇవీ చదవండి