Breaking News

మణిపుర్‌లో మళ్లీ చెలరేగిన హింస


Published on: 10 Feb 2026 16:26  IST

మణిపుర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో మంగళవారం ఉదయం మళ్లీ హింసాకాండ చెలరేగింది. గత శనివారం రాత్రి టాంగ్‌ఖుల్ నాగ కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తిపై కొందరు దాడి చేశారనే ఆరోపణలతో మొదలైన వివాదం క్రమంగా పెద్దఎత్తున హింసకు దారి తీసింది. వందలాది మంది టాంగ్‌ఖుల్ గ్రామస్థులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు ఇళ్లు వదిలి కాంగ్పోక్పి, ఉఖ్రుల్ జిల్లాలోని సురక్షిత ప్రాంతాలకు.. రెండ్రోజులుగా తరలిపోతున్నారు. ఈ క్రమంలో ఉఖ్రుల్ జిల్లాలో తాజాగా హింస చెలరేగింది.

Follow us on , &

ఇవీ చదవండి