Breaking News

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు..


Published on: 11 Feb 2026 11:36  IST

తెలంగాణ ప్రభుత్వం బుధవారం పలువురు ఐఏఎస్ అధికారులని బదిలీ చేసింది. సింగరేణి సీఎండీగా డా.జ్యోతి బుద్ధప్రకాశ్‌ని నియమించింది. ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్‌ నియమితులయ్యారు. గిరిజన సంక్షేమ ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్ కొనసాగనున్నారు. TGRAC డీజీగా సందీప్‌కుమార్ సుల్తానియాని నియమించింది. పంచాయతీరాజ్ కమిషనర్‌గా దివ్య దేవరాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా కాత్యాయనీ దేవిని నియమించింది.

Follow us on , &

ఇవీ చదవండి