Breaking News

భాగ్యనగరంలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..


Published on: 11 Feb 2026 15:34  IST

హైదరాబాద్ నగరంలో భారీగా గంజాయి రవాణా విక్రయానికి పాల్పడుతున్న నెట్‌వర్క్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్, ఎస్ఆర్‌ నగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో 70 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన గంజాయి విలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన మనీల్ దలబెహరా, ఇస్మాయిల్ రైతా అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి