Breaking News

11వ తేదీ..11 మంది..11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారుగా


Published on: 11 Feb 2026 17:35  IST

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Session) ఈరోజు (బుధవారం) ఉదయం ప్రారంభమవగా.. కేవలం 11 నిమిషాల్లోనే వైసీపీ సభ్యులు వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఉదయం 10:00 గంటలకు సభ మొదలైన వెంటనే గవర్నర్ అబ్దుల్ నజీర్(Governor Abdul Nazeer) ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా సభకు హాజరైన వైసీపీ సభ్యులు.. కాసేపటికే నిరసన తెలుపుతూ బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటనపై అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సరదా వ్యాఖ్యలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి