Breaking News

ఎమ్మెల్యే సతీమణి డిజైనర్‌ స్టోర్‌లో చోరీ..


Published on: 11 Feb 2026 18:02  IST

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి సతీమణి అనుశ్రీ రెడ్డి నిర్వహిస్తున్న డిజైనర్ స్టోర్‌లో జరిగిన చోరీ కేసును బంజారాహిల్స్ పోలీసులు ఛేదించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎన్‌బీటీ నగర్‌లో ఓ డిజైనర్ స్టోర్‌ను నిర్వహిస్తున్నారు అనుశ్రీ రెడ్డి. ఈనెల 6న ఆ స్టోర్‌లో ఓ చోరీ జరిగింది. ఈ స్టోర్‌లో హౌస్‌కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న అమీనుల్ హక్(38) ఈ చోరీకి పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. అస్సాంకు చెందిన ఈ నిందితుడు కొన్ని నెలలుగా స్టోర్‌లో నమ్మకంగా పనిచేస్తున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి