Breaking News

ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్..


Published on: 11 Feb 2026 18:54  IST

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల లోపు క్యూలో నిలుచున్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఇచ్చారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు పోలింగ్ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 13న ఓట్లు లెక్కింపు ఉంటుందని, 16న కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుందని అధికారులు తెలిపారు. ఎన్నికల బరిలో ఉన్నవారి అదృష్టం ఈనెల 13న తేలబోతుంది.

Follow us on , &

ఇవీ చదవండి