Breaking News

అత్యంత ప్ర‌మాద‌క‌రంలో మంజీరా బ్యారేజీ : కేటీఆర్


Published on: 27 Jun 2025 18:49  IST

కాంగ్రెస్ సర్కారు చేతకానితనంతో నిన్న జూరాల ప్రాజెక్టును డేంజర్‌లోకి నెట్టిన సంఘటనకు 24 గంటలు గడవకముందే హైదరాబాద్ జంటనగరాలకు మంచినీరు అందించే మంజీరా బ్యారేజీని కూడా ప్రమాదంలో పడేయడం అత్యంత ఆందోళనకరం అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణలో సీఎం రేవంత్ ఘోర వైఫల్యం వల్లే వరుసగా నిన్న జూరాల ప్రాజెక్టుకు, నేడు మంజీరా బ్యారేజీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి