Breaking News

హైదరాబాద్‌ నగరంలో యాంటీ బెగ్గింగ్ డ్రైవ్‌..


Published on: 27 Jun 2025 18:56  IST

హైదరాబాద్‌ను బిచ్చగాళ్లు లేని నగరంగా మార్చాలనే ఉద్దేశంతో అర్బన్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ అధికారులు డ్రైవ్‌ నిర్వహించారు.ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా యూసీడీ విభాగం అధికారులు బషీర్‌బాగ్‌, నాంపల్లి, సెక్రెటేరియట్, బేగంబజార్‌ ఏరియాల్లోని ట్రాఫిక్‌ జంక్షన్‌లు, ఫూట్‌పాత్‌లపై నిర్వాసితులుగా ఉన్న 221 మందిని గుర్తించారు. వారిలో 202 మందికి కౌన్సిలింగ్‌ వారి స్వస్థలాలకు పంపించారు. మరో 19 మంది తమకు ఎవరూ లేరని చెప్పడంతో వారికి నైట్‌ షెల్టర్లలో ఆశ్రయం కల్పించారు.

Follow us on , &

ఇవీ చదవండి