Breaking News

యాజమాన్యం తప్పుంటే కఠిన చర్యలు తీసుకోవాలి


Published on: 02 Jul 2025 18:50  IST

సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు మరణించిన ఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. అదొక దురదృష్టకరమైన ఘటన అని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. ఈ ప్రమాదంలో సిగాచీ ఫార్మా ఫ్యాక్టరీ యాజమాన్యం తప్పిదం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఒవైసీ డిమాండ్‌ చేశారు. ఇది బాధాకరమైన ఘటన అని ఆవేదన వ్యక్తంచేశారు.

Follow us on , &

ఇవీ చదవండి