Breaking News

కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌కు మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు


Published on: 02 Jul 2025 18:55  IST

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 21వ తేదీన గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడే సందర్భంగా ఫిరోజ్ ఖాన్ మహిళల్ని అవమానించేలా పలు వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మేరకు తను చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 4న విచారణకు వచ్చి వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి