Breaking News

నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుకు వ‌ర‌ద ప్ర‌వాహం


Published on: 16 Jul 2025 18:35  IST

జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణ‌మ్మ ప‌రుగులు పెడుతుంది. శ్రీశైలం నుంచి సాగ‌ర్ వైపు వ‌ర‌ద కొన‌సాగుతోంది. దీంతో నాగార్జున సాగ‌ర్‌కు వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతుంది. దీంతో సాగ‌ర్ జ‌లాశ‌యం క‌ళ‌క‌ళ‌లాడుతుంది.ప్ర‌స్తుతం ఇన్‌ఫ్లో 65,094 క్యూసెక్కులు ఉండ‌గా, ఔట్ ఫ్లో 1650 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 557.80 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 227.2912 టీఎంసీలుగా ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి