Breaking News

మొంథా తుపాన్ ఎఫెక్ట్.. కూలిన బ్రహ్మంగారి నివాసం


Published on: 29 Oct 2025 18:52  IST

మొంథా తుపాన్ కారణంగా భారీ వర్షాలకు బ్రహ్మంగారి నివాసం కూలిపోయింది. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో 16వ శతాబ్దం నాటి ఒక మిద్దె ఉంది. అందులోనే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివసించేవారు. అయితే తుపాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో మట్టి మిద్దె నాని పడిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. బ్రహ్మంగారి నివాసాన్ని పునరుద్ధరించాలని కడప కలెక్టర్‌ను ఆదేశించారు మంత్రి నారా లోకేశ్.

Follow us on , &

ఇవీ చదవండి