Breaking News

అమెజాన్‌ లేఆఫ్స్‌.. భారత్‌లో 1000 మందిపై ఎఫెక్ట్‌!


Published on: 29 Oct 2025 19:00  IST

ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తన గ్లోబల్‌ లేఆఫ్‌లలో భాగంగా భారత్‌లో 800-1000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. అమెజాన్‌ తన కార్పొరేట్‌ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 14,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా భారత్‌లోనూ ఆ మేర తొలగింపులు చేపట్టనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, మానవ వనరులు, టెక్‌ విభాగంలో ఈ తొలగింపులు ఉండొచ్చని పేర్కొన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి