Breaking News

మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు..


Published on: 26 Dec 2025 11:54  IST

కర్ణాటకలోని మైసూరు నగరంలో భారీ పేలుడు సంభవించింది. డిసెంబర్ 25 గురువారం రాత్రి మైసూరు లోని అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో ఈ ఘటన జరిగింది . పేలుడు కారణంగా ఒకరు అక్కడికిక్కడే మృతిచెందగా.. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ సిలిండర్ వల్లే పేలుడు సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి