Breaking News

దంచికొడుతున్న వానలు.. ట్రాఫిక్‌‌లో నిత్య నరకం


Published on: 23 Jul 2025 15:10  IST

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం ఉదయం నుంచే పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంతోపాటు శివారు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. అయితే అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు వాతావరణ శాఖ స్పష్టంగా సూచించింది. ఇక తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నేటి నుంచి రానున్న నాలుగు రోజుల వరకు వరుసగా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి