Breaking News

మోహన్‌బాబు కేసులో తీర్పు రిజర్వ్‌


Published on: 23 Jul 2025 15:56  IST

సినీ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌ చేసింది. తన విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని కోరుతూ 2019లో తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారిపై విద్యార్థులతో ఆయన ధర్నా నిర్వహించారు. అప్పుడు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో మోహన్‌బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్‌, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి