Breaking News

ఐపీఎల్‌ ఫైనల్లో పంజాబ్‌


Published on: 02 Jun 2025 12:18  IST

పంజాబ్‌ అదరగొట్టింది. రెండో అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆ జట్టు స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఐపీఎల్‌ 18 ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఎలిమినేటర్‌లో పరాభవం మిగిల్చిన నిరాశ నుంచి కోలుకుంటూ పంజాబ్‌.. క్వాలిఫయర్‌ 2లో అయిదుసార్లు ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌పై అద్భుత విజయం సాధించింది.కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అదిరే బ్యాటింగ్‌తో పంజాబ్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆ జట్టు ఇంతకుముందు ఒకే ఒక్కసారి.. 2014లో ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి