Breaking News

గిరిజన కుంభమేళా మేడారం


Published on: 30 Jan 2026 16:10  IST

దేశంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా మేడారం జాతర అని కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి జువల్‌ ఓరం అన్నారు. గురువారం మేడారం మహా జాతరలో సమ్మక్క, సారలమ్మలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌లతో కలిసి ఆయన మొక్కులు చెల్లించారు. అనంతరం విలేకరులతో జువల్‌ ఓరం మాట్లాడుతూ. 20 ఏళ్ల కిందటే తాను ఇక్కడికి వచ్చానని, మళ్లీ ప్రధాని మోదీ ఆదేశాలతో ఈ పవిత్ర ప్రాంతానికి రావడం ఆనందంగా ఉందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి