Breaking News

నాంపల్లి అగ్నిప్రమాదం.. డీసీపీ స్పందన ఇదే.?


Published on: 07 Feb 2026 18:39  IST

హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ల్యాబ్ భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కీలక పత్రాలు మంటల్లో కాలిపోయినట్లు సమాచారం. అయితే ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి.. హైదరాబాద్ పోలీస్ సెంట్రల్ జోన్ డీసీపీ కె.శిల్పవల్లి మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని ఆమె తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి